
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో యువతి రాములమ్మపై ప్రియుడు పెట్రోలుపోసి నిప్పుపెట్టిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు తెలియజేశారు. గురువారం రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగిందని, బాధితులు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేయగానే వెంటనే పోలీసులు స్పందించి ఆమెను సమీప ఆస్పత్రిలో చేర్చారని తెలిపారు. ఈక్రమంలో మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాములమ్మను విశాఖపట్నం తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని, అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యనారాయణను సీఎం ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి బొత్స సహా డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి, అధికారులు బాధితురాలిని పరామర్శించారు.
చదవండి: కాబోయే భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
రమ్య హత్య ఘటన ఇప్పటికీ కలచి వేస్తోంది: సుచరిత