
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16వ తేదీన బాపట్ల జిల్లా నిజాంపట్నంలో పర్యటించనున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా లబ్ధిదారుల ఖాతాల్లో వేట నిషేధ భృతిని కంప్యూటర్‌లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నిజాంపట్నం చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నగదు జమ చేసిన తర్వాత తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. గత నాలుగేళ్ల మాదిరిగానే వరుసగా ఐదో ఏడాది కూడా వేటపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్నారు.