మనసున్న మారాజు మా జగనన్న: ఓ తల్లి కన్నీటి ఆనందం

CM Jagan Effect: Kakinada Collector Kritika Shukla Helps Mother - Sakshi

సాక్షి, కాకినాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాయకరావుపేటలో పర్యటించిన సందర్భంలో ఓ తల్లి కష్టం చూసి చలించిపోయిన విషయం తెలిసే ఉంటుంది. వైకల్యంతో బాధపడుతున్న తన బిడ్డకు సాయం అందించాలని ఓ తల్లి ఆయన్ని దీనంగా వేడుకుంది. దీంతో చలించిపోయిన సీఎం జగన్‌.. తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, అలాగే పింఛను మంజూరు చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను అక్కడిక్కడే ఆదేశించారు‌. అయితే.. 

జగనన్న ఇచ్చిన సాయం మాటగానే మిగిలిపోలేదు. ఆయన సూచనల మేరకు అంతేత్వరగతిన అధికారులు స్పందించారు. రెండు గంటలలోపే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.. తనూజ, చిన్నారి ధర్మతేజలను కాకినాడ కలెక్టరేటుకు రావాలని సూచించారు. డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణితో ఆ తల్లీకొడుకుల రాకకోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబరుకు పిలిపించుకుని రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం ఆ తల్లికి అందించారు. అలాగే చిన్నారి ధర్మతేజకు వచ్చే నెల నుండి పింఛను మంజూరు చేస్తున్నట్లు భరోసా ఇచ్చారు. చిన్నారికి పూర్తిస్థాయి వైకల్యం ఉండడంతో.. రూ. 35 వేల రూపాయల విలువైన వీల్ చైర్ అందించారు. 

అసలేం జరిగిందంటే..
కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన నక్కా తనూజకు వైకల్యంతో బాధపడుతున్న కొడుకు ఉన్నాడు. పూర్తిగా బిడ్డ ఆలనాపాలనా చూస్కోవాల్సి రావడంతో.. తనూజ కూలీ పనులకు వెళ్లలేక ఆర్థికంగా ఇబ్బందిపడింది. అధికారులకు అర్జీ పెట్టుకుంది. ఈలోపు తన నిస్సహాయ స్థితిని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు చిన్నారితో సహా ఎదురుచూసింది. గురువారం పాయకరావు పేటలో సీఎం జగన్‌ ఓ వివాహ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసి.. ఆ కళ్యాణ మండపం దగ్గరకు చేరుకుని.. జనం మద్యలో నిలుచుంది.  

ఇంతలో అక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్‌ నుంచే తనూజను చూశారు. కాన్వాయ్‌ను ఆపించి.. ఆమెను దగ్గరకు పిలిచి కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. పిలిచి సహాయం అందించి, తన కష్టాలను తొలగించిన జగనన్న మంచి మనసుకు.. ఆ తల్లి పదే పదే కన్నీళ్లతో కృతజ్ఞతలు చెబుతోంది.

ఆ తల్లి కష్టం చూసి చలించి.. సీఎం జగన్‌ సత్వర సాయం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top