CM Jagan Comments On Jagananna Thodu For Street Vendors - Sakshi
Sakshi News home page

‘చిరు’ రుణాల్లో ఏపీ ఫస్ట్‌.. దేశ చరిత్రలోనే రాష్ట్రం రికార్డు

Published Thu, Jan 12 2023 3:49 AM

CM Jagan Comments On Jagananna Thodu for Street Vendors - Sakshi

చిరు వ్యాపారులందరూ వాళ్ల కష్టం మీదే ఆధార పడుతున్నారు. పెట్టుబడి సాయం కింద మనం వాళ్ల వ్యాపారం కోసం రూ.10 వేలు సాయం చేస్తున్నాం. వాళ్లు మరొకరి దగ్గర వస్తువులు, పండ్లు, కూరగాయలు తదితరాలు కొనుగోలు చేసి.. ప్రజలకు విక్రయిస్తున్నారు. తద్వారా వాళ్ల బతుకు వారు బతకడమే కాకుండా.. స్వయం ఉపాధి రంగంలో గొప్ప మార్పు తీసుకొస్తున్నారు. అందువల్లే వారికి తోడుగా నిలిచాం. ఇప్పటి వరకు 15,31,347 మంది చిరు వ్యాపారులుకు రూ.2,406 కోట్లు వడ్డీ లేని రుణం అందించాం.      
– సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంలో దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించిందని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. దేశం మొత్తం మీద చిరు వ్యాపారులకు 24.06 లక్షల మందికి రుణాలు ఇస్తే, ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే జగనన్న తోడు పథకం కింద 15.31 లక్షల మందికి రుణాలు ఇచ్చామని స్పష్టం చేశారు. రుణాలను సంఖ్యాపరంగా తీసుకుంటే దేశ వ్యాప్తంగా 39.21 లక్షల రుణాలకు గాను, ఒక్క మన ఏపీలో మాత్రమే 24.06 లక్షల రుణాలు ఇచ్చామన్నారు. తద్వారా స్వయం ఉపాధి వ్యవస్థలో గొప్ప మార్పు వస్తోందన్నారు.

చిరు వ్యాపారులందరూ వాళ్లంతట వారే ఉపాధి కల్పించుకోవడమే కాకుండా సమాజానికి కూడా గొప్ప మేలు చేస్తున్నారని కొనియాడారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు ఆరవ విడత రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలను ఇచ్చే కార్యక్రమాన్ని బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి బ్యాం­­క్‌ల ద్వారా కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందించడంతో పాటు, గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

నడ్డి విరిగే వడ్డీలకు చెల్లుచీటీ చెబుతూ చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చిరు వ్యాపారుల్లో 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కచెల్లె్లమ్మలు, అన్నదమ్ములకు ‘జగనన్న తోడు’ అందుతోందన్నారు. 3.95 లక్షల మందిలో 3.67 లక్షల మం­ది సకాలంలో రుణాలు చెల్లించి, మళ్లీ రెండో­సారి రు­ణాలు తీసుకుంటున్నారని చెప్పారు. వీరు కాక మ­రో 28 వేల మందికి ఇవాళ రుణాలు ఇస్తూ కొత్తగా ఈ పథకంలోకి తీసుకొచ్చామన్నారు. మొ­త్తం­మ్మీద జగనన్న తోడు ద్వారా దాదాపు 15.31 లక్షల చిరు వ్యాపారుల కుటుంబాలకు మంచి జరుగుతోం­దన్నారు.

వీరంతా ఇతరులపై ఆధా­ర పడ­కుండా.. వడ్డీలు, చక్రవడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రూ.10 వేలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తున్నామని చెప్పారు. ‘ఎవరికి అవసరమైతే వాళ్లు రుణాలు తీసుకుంటు­న్నారు. తిరిగి చెల్లిస్తున్నారు. వాళ్లకు స­హా­యంగా బ్యాంక్‌లు తిరిగి రుణాలు ఇస్తు­న్నాయి. వాళ్లు క­ట్టిన వడ్డీని ప్రభు­త్వం ప్రతి 6 నెలలకు ఒకసారి వె­నక్కు తి­రిగి ఇస్తోంది. తద్వారా వ్యవస్థలో గొప్ప మా­ర్పు క­­నిí­³స్తోంది’ అని అన్నారు.  సీఎం ఏమన్నారంటే.. 

ఆ రుణానికి ప్రభుత్వ గ్యారంటీ  
► ఫుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్డు పక్కన టిఫిన్‌ సెంటర్లు నిర్వహించే వారు.. గంపలు, బుట్టల్లో పెట్టుకుని వస్తువులు అమ్మేవారు.. సై­కిళ్లు, మోటారు సైకిళ్లు, ఆటోలపై వెళ్లి వ్యా­పారం చేసుకునే వారితో పాటు చేనేతలు, సంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు, ఇత్తడి పనిమీద బతికేవారికి. బొబ్బిలి వీణ వంటివి తయారు చేసే వారు, ఏటికొప్పాక, కొండపల్లి బొ­మ్మలు, కళంకారీ, తోలు బొమ్మలు, లేస్‌ వర్క­ర్స్‌ అందరికీ ఈ రోజు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నాం.  

► బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం లే­కుం­డా, ప్రభుత్వమే బ్యాంకులను ఒప్పించి వీ­రం­దరికీ సున్నా వడ్డీ పథకం కింద రూ.10 వేలు ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రుణాలు సకాలంలో చెల్లిస్తే మళ్లీ బ్యాంకులు వారికి తిరిగి రుణాలిచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది.   

వారి కష్టాలు, బాధలు చూసినందుకే.. 
► నా సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల బా«­దలు, కష్టాలు నా కళ్లతో చూశాను. ప్రతి చోటా, ప్ర­తి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో ఇవన్నీ సా«­దారణంగా కనిపించే విషయాలు. ఇటువంటి చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లకు పెట్టుబడి సమకూర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. 

► రూ.1,000 అప్పు కావాలంటే ముందే రూ.100 తీసుకుని, రూ.900 చేతిలో పెట్టి.. నెల నాటికి మ­­ళ్లీ ఆ డబ్బులు కట్టించుకుంటూ.. తిరిగి ఈ చి­రు వ్యాపారులతోనే వ్యాపారం చేసే అధ్వాన్నమై­న పరిస్థితుల్లో సమాజం ఉంది. అలాంటి స­మా­జంలో మార్పులు తీసుకొచ్చి, వాళ్ల బాధల­కు, ఆ రోజు నేను చూసిన వాళ్ల కష్టాలకు శా­శ్వ­త ప­రి­ష్కారం తీసుకురావాలన్న తపన, తాపత్రయం­­తోనే జగనన్న తోడు పథకం తీసుకువచ్చాం. 

► ఇప్పటి వరకు రుణాలు పొందిన 15,31,347 మందిలో 8,74,745 మంది బ్యాంకులకు రుణం చెల్లించి.. మళ్లీ రెండోసారి రుణాలు పొందారు. ఇలా వీరంతా ఏడాది సైకిల్‌ పూర్తి చేసుకుని బ్యాంకులతో భేష్‌ అనిపించుకున్నారు.  

సకాలంలో చెల్లిస్తే రూ.13 వేల వరకు రుణాలు 
► సకాలంలో రుణాలు కడితే రూ.10 వేల నుంచి మరో రూ.వెయ్యి పెంచి రూ.11వేలు, రూ.­11 వేల నుంచి రూ.వెయ్యి పెంచి రూ.12 వేలు అందించే కార్యక్రమం చేస్తూ.. రూ.13 వేల వరకు ఇచ్చేలా బ్యాంకులను ఒప్పించాం. వీళ్లందరికీ జగనన్నతోడుతో పాటు ఆసరా, చేయూ­త, సున్నా వడ్డీ, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మా­ణం, వి­ద్యా­దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, ఆరో­గ్య­శ్రీ ,ఆరోగ్య ఆసరా, రైతు భరోసా అన్ని పథకా­లతో మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో వీ­రందరికీ మంచి జరగాలి. జీవనప్ర­మా­ణా­లు మారాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే పరిస్థితి రావాలి.  

► ఉప ముఖ్యమంత్రి  బూడి ముత్యాలనాయుడు,  మంత్రులు ఆదిమూలపు, బొత్స, సీఎస్‌ జవ­హ­ర్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెష­ల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పాల్గొన్నారు. 

ఇది నిరంతర ప్రక్రియ 
► 6 నెలలకు ఒకమారు వడ్డీ లేని రుణాలి­చ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. 2020 నవంబర్‌లో ఈ దిశగా తొలిసారి అడుగులు పడ్డా­యి. ప్రస్తుతం 6వ దశ కా­ర్యక్రమం జరు­గుతోంది. సకాలంలో వడ్డీ కట్టిన వారికి తి­రిగి వెనక్కు ఇచ్చే కార్యక్రమంలో భా­గం­గా ఈ రోజు ఇచ్చే రూ.15.17 కోట్ల వడ్డీ­తో కలుపుకుని, సకాలంలో రుణాలు చె­ల్లించిన 13.28 లక్షల మంది లబ్ధిదారుల­కు ప్రభుత్వం తరపున రూ.63.65 కోట్లు చెల్లించాం.  

► అర్హత ఉండీ కూడా ఎవరైనా ఈ పథకాన్ని అందుకోలేకపోయి ఉంటే ఎవరూ కంగా­రు పడాల్సిన పనిలేదు. అలాంటి వారంతా గ్రామ సచివాలయంలోకి వెళ్లి దరఖా­స్తు చేసినా, వలంటీర్‌కు చెప్పడంతో పా­టు 1902 నంబరుకు ఫోన్‌ చేస్తే చాలు. వాళ్లతో దరఖాస్తు నింపించడం మొదలు బ్యాంకులతో టై అప్‌ చేయించి వాళ్ల వ్యా­పా­రాలకు అన్ని రకాలుగా సహాయ, సహ­కారాలు అందించే కార్యక్రమం ప్రభు­త్వం దగ్గరుండి చేస్తుంది. ఇది నిరంతరం జరుగుతుంది. ఈ పథకాన్ని వీలైనంత ఎక్కు­వ మందికి అందుబాటులోకి తీసు­కు­రావాలని కలెక్టర్లకు సూచిస్తున్నాను.  

► సకాలంలో డబ్బులు కడుతున్న వారి కో­సం ఒక బ్యాంకును రెండు సచివాలయాలకు టైఅప్‌ చేశాం. ఈ రెండు సచివాలయాల్లో ఉన్న సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటూ పనిచేస్తా­రు. ఎవరైనా రుణాలు చెల్లించలేకపోతే.. మిగిలిన వారి మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి.. సకాలంలో చెల్లించాలి.  

ఈరోజే సంక్రాంతి
చిరు వ్యాపారులందరూ ఈరోజే సంక్రాంతి పండగ చేసుకుంటున్నాం. నాది కూరగాయల అంగడి. నా భర్త కూలి పనులకు వెళ్తాడు. ఇది వరకు పెట్టుబడి కోసం రూ.1,000 అప్పు తీసుకుంటే వడ్డీ కింద ముందుగానే రూ.100 పట్టుకుని ఇచ్చే వారు. రూ.500 వడ్డీ కట్టి రూ.4,500 చొప్పున ఎన్నో­సార్లు తీసుకున్నాను. తర్వాత రూ.5 వేలు చెల్లించాను. కోవిడ్‌ లాంటి పరిస్థితుల్లో జగ­నన్న తోడు కింద రూ.­10,000 వడ్డీ లేని రుణం ఇచ్చారు. వ్యాపారం చేసుకుని, సకాలంలో రుణం చెల్లించాను. నాకు మీరు వడ్డీ కూడా జమ చేశారు. తర్వాత రూ.11 వేలు.. ఇప్పుడు రూ.12 వేల రుణం అందజేశారు.  
– పి.కోటేశ్వరి, కొడవలూరు, నెల్లూరు జిల్లా.

ఆత్మగౌరవం కాపాడుతున్నారు..
మీరు మా ఆత్మగౌరవం కాపా­డుతున్నారు. నేను టైలరింగ్‌ చే­స్తాను. నాకు ముగ్గురు పిల్లలు. టైల­రింగ్‌ మెటీరియల్‌ కోసం ఫై­నాన్షియర్‌ దగ్గరకు రూ.10 వేల కోç­Üం వెళ్తే.. రూ.1,000 మినహాయించుకుని రూ.9 వేలు చేతిలో పెట్టేవారు. ప్రతిరోజూ సాయంత్రం రూ.­200 చొప్పున అప్పు తీరే వరకు కట్టేదాన్ని. మీరు వచ్చిన తర్వాత 2020లో నవరత్నాలతో పాటు మీరు అందించిన జగనన్న తోడు మాకు చాలా ఉప­యోగపడింది.  మా అమ్మ వృద్ధాప్య పెన్షన్‌ తీసుకు­న్నప్పుడల్లా నా పెద్ద కొడుకు డబ్బులు పంపించాడని ఆనందంగా చెబుతూ ఉంటుంది.
– మాధురి, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా

అడగకుండానే వరాలు
అన్నా.. మీరు అడగకుండానే వ­రాలు ఇచ్చిన దేవుడు. నేను టైలరింగ్‌ చేస్తాను. రూ.10 వేలు వడ్డీకి తీసుకుంటే రూ.2 వేలు వడ్డీ తీసుకుని రూ.8 వేలే ఇచ్చేవారు. ఇలా ఎన్నాళ్లుగానో నా కష్టం వడ్డీ వ్యాపారుల పాలయ్యేది. మీరు వచ్చాక ఆ దుస్థితి పోయింది. మాకు మేలు జరిగింది. వలంటీర్‌ రెండు రోజుల్లోనే నాకు లోన్‌ మంజూరు చేయించారు. మేం నలుగురు అమ్మాయిలం. మాకు మగబిడ్డ లేడని అమ్మానాన్నలు బాధ పడేవాళ్లు. మా అమ్మానాన్నలకు ఉన్న ఏకైక మగబిడ్డ మీరే అన్నా. మీ పథకాల వల్ల మేం హాయిగా జీవిస్తున్నాం.
– శశికళ, కడప, వైఎస్సార్‌ జిల్లా

జగనన్నే వన్స్‌ మోర్‌ అంటున్న జనం
మీ సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూసి చలించిపోయారు. ఆ రోజు వారందరికీ నేను తోడుగా ఉంటానని మీరు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఇప్పటివరకు 15 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు రూ.2,400 కోట్లకు పైగా రుణాలు అందించారు. చిరు వ్యాపారులు నిశ్చింతగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.  అందుకే జగనన్నే వన్స్‌ మోర్‌.. అంటున్నారు. 
– ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

చిరు వ్యాపారుల కుటుంబాల్లో వెలుగు
చిరు వ్యాపారులు, కుల వృత్తుల వారు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకుని.. రోజు వడ్డీలు, వారపు వడ్డీలు, నెల వడ్డీల కోసం వారు సంపాదించిన దాంట్లో 90 శాతం చెల్లించే దుస్థితిని మీరు (సీఎం) మార్చేశారు. ఎలాంటి హామీ లేకుండా బ్యాంకుల్లో రూ.10 వేలు రుణాలిచ్చే విధంగా మీరు తీసుకున్న చర్యలు లక్షలాది కుటుంబాల్లో వెలుగు నింపాయి. వారందరూ కూడా మీరే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు.  
– బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి  

Advertisement

తప్పక చదవండి

Advertisement