
చిత్తూరు కలెక్టరేట్ : తమాషాలు చేస్తున్నారా....సరెండర్ చేస్తా అని జిల్లా కలెక్టర్ కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఏమో ప్రతి సోమవారం ఉదయం 9.30 గంటలకు ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరవుతారు. ఆయన వచ్చిన గంట తరువాత పలువురు జిల్లా అధికారులు హాజరుకావడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కలెక్టర్ విచ్చేసిన గంట తర్వాత హౌసింగ్ శాఖ ఈడీ గోపాల్ నాయక్ విచ్చేశారు.
ఆయనతో పాటు మరో నలుగురు జిల్లా అధికారులు ఆలస్యంగా విచ్చేశారు. హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ పై ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వెళ్లిపోవాలంటూ పీజీఆర్‌ఎస్ నుంచి పంపించేశారు. అలాగే డీఎంఅండ్‌హెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్ అని పిలవగా వారిద్దరు సైతం పీజీఆర్‌ఎస్‌కు హాజరుకాని పరిస్థితి. దీంతో గైర్హాజరైన డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలిను సరెండర్ చేస్తానంటూ కలెక్టర్ మండిపడ్డారు.