సాక్షి, విజయవాడ: దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో రికార్డులు నమోదు చేసిన ఆయన మళ్లీ భారీ అప్పు చేశారు. ఈ మంగళవారం(ఏప్రిల్ 21వ తేదీ) రూ.4,600 కోట్లు అప్పు తెచ్చారు.
గడిచిన 23 నెలల్లో మొత్తం అప్పులు రూ.3,56,655 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెలలోనే రూ.9,000 కోట్లు, ఈ నెల 7వ తేదీన రూ.4,400 కోట్లు అప్పు చేశారు.
ఘోర పాలనా వైఫల్యంతో అప్పుల రికార్డు నెలకొల్పిన చంద్రబాబు రూ.1,98,564 కోట్లు బడ్జెటరీ అప్పులు, కార్పొరేషన్ల గ్యారెంటీ కింద రూ.1,10,704 కోట్లు, రాజధాని అప్పులు రూ.47,387 కోట్లు చేశారు.
ఇలా దేశంలోనే అత్యధిక అప్పులు చేసిన సీఎంగా చంద్రబాబు రికార్డులు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన హయాంలో 60 నెలల్లో రూ.3,32,000 కోట్ల అప్పులు చేస్తే, చంద్రబాబు కేవలం 23 నెలల్లోనే రూ.3,56,655 కోట్ల అప్పులు చేయడం గమనార్హం.


