కొత్త జిల్లాలకు కోడ్‌లను కేటాయించిన కేంద్రం

Central Government Assigned Local Government Directory Codes New Districts - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లు కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్‌లను కేటాయించింది. రాష్ట్రాలతో కేంద్రం జరిపే పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలకు సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు తదితర అంశాల్లో వీటిని వినియోగిస్తారు.

చదవండి: (ఏపీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top