కోళ్లకు కొరత!  | Broiler Chickens Shortage fear of virus to Poultry farmers | Sakshi
Sakshi News home page

కోళ్లకు కొరత! 

Mar 7 2022 4:44 AM | Updated on Mar 7 2022 9:28 AM

Broiler Chickens Shortage fear of virus to Poultry farmers - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: వైరస్‌ భయంతో బ్రాయిలర్‌ కోళ్ల పెంపకాన్ని ఫౌల్ట్రీ రైతులు తగ్గించడంతో.. మార్కెట్‌లో కొరత ఏర్పడుతోంది. దీంతో చికెన్‌ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 5న చికెన్‌(స్కిన్‌లెస్‌) కిలో ధర రూ.200 ఉండగా.. ఇప్పుడది రూ.300 దగ్గరకు చేరుకుంది. స్థానిక పౌల్ట్రీల నుంచి రోజూ మూడు లక్షల బ్రాయిలర్‌ కోళ్ల విక్రయాలు జరుగుతుంటాయి.

హైదరాబాద్‌ నుంచి కోళ్ల కొనుగోళ్లు నిలిచిపోయాయి. డిమాండ్‌కు తగినన్ని బ్రాయిలర్‌ కోళ్లు లభ్యం కాక ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాజా వెంకటేశ్వరరావు(నాని) ‘సాక్షి’కి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement