వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు | Sakshi
Sakshi News home page

వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు

Published Sun, Aug 23 2020 11:39 AM

Brahmotsavam Celebrations Started In Kanipakam Temple - Sakshi

సాక్షి, చిత్తూరు: కాణిపాకం వరసిద్ధివినాయకుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధ్వజారోహణ కార్యక్రమం ఆదివారం సంప్రదాయం గా నిర్వహించారు. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయానికే పరిమితం అయ్యింది. ఈ రోజు సాయంత్రం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యల్లోనే భక్తులకు అనుమతి కల్పించనున్నారు.

విద్యుత్‌ వెలుగులు, ప్రత్యేక పుష్పాలంకరణలతో గణనాథుని ఆలయం శోభాయమానంగా వెలిగిపోతోంది. శనివారం చవితి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేకువజామున మూలస్థానంలోని గణనాథునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement