‘కరోనా’ అంత్యక్రియల్లో భూమన కరుణాకర్‌రెడ్డి

Bhumana Karunakar Reddy Awareness On Corona Dead Bodies Funerals - Sakshi

సాక్షి, తిరుపతి: కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు తిరుపతి ఎమ్మెల్యే, కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, సాక్షి టీవీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆసుపత్రిలో నుంచి మృతదేహాలను బయటికి తీయడం, అంబులెన్స్‌లో ఎక్కించడం, కుటుంబ సభ్యులకు అప్పగించడం, దహన సంస్కారం చేసే వారంతా మనుషులే కదా అని ఆయన అన్నారు. వారికి లేని భయం ప్రజలకు, కుటుంబ సభ్యులకు ఉండటం సరికాదని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను తిరుపతిలో కరోనా మృతుల అంత్యక్రియల్లో పాల్గొంటున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. మార్గదర్శకాలు, తగిన జాగ్రత్తలతో కోవిడ్‌ మృతులకు కూడా అంత్యక్రియలు జరుపుకోవచ్చని తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అవగాహన కోసం కరోనా మృత దేహాల అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన పలువురికి ఆదర్శంగా నిలిచారు.
(పవన్‌ అభిమానికి సీఎం జగన్‌ ఆర్థిక సాయం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top