 
													సాక్షి, వైఎస్సార్ కడప: బద్వేల్ ఉప ఎన్నికలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 9 నామినేషన్లను అధికారులు తిరస్కరించగా.. బద్వేల్ బరిలో 18 మంది నిలిచారు. కాగా నామినేషన్ల ఉప సంహరణకు ఈనెల 13 వరకు గడువుంది.
చదవండి: Huzurabad Bypoll: కోడికూర ఉండాల్సిందే..!
మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నిక లో నామినేషన్‌ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 61 నామినేషన్లు దాఖలవ్వగా.. 19 నామినేషన్‌లను అధికారులు తిరస్కరించారు దీంతో 42 మంది అభ్యర్థుల నామినేషన్‌లు ఒకే అయ్యాయి. ఈటల పేరుతో ఉన్న ముగ్గురు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 13 వరకు గడువుంది.
చదవండి: బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.792 కోట్లు: పెద్దిరెడ్డి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
