తాడేపల్లి: టీమిండియాకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్‌లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలబడి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన తెలుగు తేజం తిలక్ వర్మకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఫైనల్‌లో తిలక్ వర్మ ప్రదర్శించిన పోరాట పటిమ అభినందనీయమన్నారు. తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఆసియా కప్ విజయంతో దేశానికి మరో చిరస్మరణీయ విజయాన్ని అందించిన టీమిండియాకు అభినందనలు చెప్పారు వైఎస్ జగన్.
Heartiest congratulations to Team India on a magnificent victory over Pakistan in the Asian Games final!
Special congratulations to our Telugu star Tilak Varma for his brilliant match-winning 51*. A proud moment for all of us!
Congratulations, Team India, on winning the Asian… pic.twitter.com/ONLBdljdjf— YS Jagan Mohan Reddy (@ysjagan) October 3, 2026


