క్యాన్సర్‌ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు.. 2030 నాటికి టాప్‌లో ఏపీ: మంత్రి రజిని

AP stands at the top in cancer prevention Says Vidadala Rajini - Sakshi

సాక్షి, గుంటూరు: రాబోయే పదేళ్లలో.. క్యాన్సర్‌ నివారణకుగానూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. క్యాన్సర్‌ నివారణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 

ఏపీ బడ్జెట్‌లో.. రూ.400 కోట్లను క్యాన్సర్‌ నివారణకు కేటాయించారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌కి హోమీబాబా క్యాన్సర్ కేర్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందంద కుదుర్చుకుంది. కర్నూల్‌లో రూ.120 కోట్లతో కేన్సర్‌ యూనిట్‌ ఏర్పాటు జరుగుతోంది. అలాగే విశాఖ కేజీహెచ్‌లో రూ.60 కోట్లతో క్యాన్సర్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నాం అని ఆమె తెలిపారు. 2030 నాటికి క్యాన్సర్ నివారణలో ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల బట్టి కోటి 60 లక్షల మంది ప్రతి ఏటా క్యాన్సర్ కు గురవుతున్నారన్నారు. 2030 నాటికి 30 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిందని మంత్రి విడదల రజని ఈ సందర్భంగా తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top