
విజయవాడ తమ సమస్యలను పరిష్కరించకపోతే ‘పవర్’ ఏమిటో చూపిస్తామని ఇప్పటికే హెచ్చరించిన ఏపీ విద్యుత్ జేఏసీ.. రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) చలో విజయవాడకు పిలుపునిచ్చింది. విద్యుత్ జేఏసీ పిలుపుతో ఉద్యమానికి సిద్ధమైంది విద్యుత్ సిబ్బంది. వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం సహా 15 ప్రధాన డిమాండ్లు చేస్తుంది విద్యుత్ జేఏసీ.
విద్యుత్తు యాజమాన్యాలు, ప్రభుత్వంతో పలు దఫాల చర్చలు జరిగినా పరిష్కారం రాకపోవడంతో సమ్మెకు సిద్ధమైంది. దీనిలో భాగంగా రేపు చలో విజయవాడకు పిలుపునిచ్చింది. 15వ తేదీ నాటికి తమ సమస్యలకు పరిష్కారం రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగుతారని హెచ్చరించింది. సమ్మెలో పాల్గొనడానికి అరవై వేలమంది విద్యుత్ సిబ్బంది సన్నద్ధమైంది. రేపు చలో విజయవాడ కార్యక్రమానికి విద్యుత్ సిబ్బంది వేల సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.
ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లివీ
» కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి.
» విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదురహిత అపరిమిత వైద్య సౌకర్యం
కల్పించాలి.
» జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంట్)లకు పాత సర్వీసు నిబంధనలు వర్తింపజేయాలి. వారికి అసిస్టెంటు లైన్‌మెన్‌గా పదోన్నతి కల్పించాలి.
» కారుణ్య నియామకాలు కల్పించటంలో కన్సాలిడేటెడ్ పే ఇస్తున్న పద్ధతిని రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలి.
» పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏ/డీఆర్‌లను మంజూరు చేయాలి. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ప్రకారం జీతం స్కేల్స్ రూపొందించాలి.
» ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన జూనియర్ ఇంజనీర్లకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతిలో ఒక ప్రత్యేకమైన అవకాశం కల్పించాలి.
» అర్హులైన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) తదితర సర్వీసులకు చెందిన ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ ఖాళీలలో నియమించాలి.
» 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లను కాంట్రాక్టుకు ఇవ్వడం ఉపసంహరించాలి.
» అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలి. పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలి.
» పర్సనల్ ‘పే’ని ఎన్‌క్యాష్‌మెంట్ లీవ్, పదవీ విరమణ చేసినప్పుడు టెర్మినల్ లీవుతో కలిపి పేమెంట్ చేయాలి.
» విద్యుత్ సంస్థలలో ఉన్న అన్ని ట్రస్టులను బలోపేతం చేసి మూడు నెలలకు ఒకసారి ట్రస్టు అడ్వైజరీ కమిటీ మీటింగ్‌లను నిర్వహించాలి.
ఇదీ చదవండి:
మా ‘పవర్’ ఏమిటో చూపిస్తాం!