ఏపీ: టెన్త్‌ పాసైన విద్యార్ధులకు ఆన్‌లైన్‌లో మైగ్రేషన్ సర్టిఫికేట్

AP Education Department To Issue Migration Certificate In Online For 2020-21 Tenth Passed Outs - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్దులకు ఆన్‌లైన్‌లో మైగ్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. ఇందుకోసం విద్యార్ధులు 80 రూపాయిలు చెల్లించి విద్యా శాఖ వెబ్‌సైట్ www.bse.ap.gov.in 2021 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు పేర్కొంది.

కాగా, 2004 తర్వాత టెన్త్‌ పాసైన విద్యార్ధులు సైతం మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ తెలిపింది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకున్న విద్యార్ధులు మైగ్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. 
చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top