ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా | AP Mega DSC Notification Postpones | Sakshi
Sakshi News home page

ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా

Nov 6 2024 2:57 PM | Updated on Nov 6 2024 3:37 PM

AP Mega DSC Notification Postpones

ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

సాక్షి, విజయవాడ: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడింది. రెండు, మూడు రోజుల్లో మళ్లీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్ 6 బుధవారం(నేడు) నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉండగా, అధికారులు వాయిదా వేస్తునట్లు వెల్లడించారు.

గ‌త వైఎస్సార్‌ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10247 పోస్టులు క‌లిపి.. మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement