
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్‌పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్‌సీపైనా కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్ డీఏతో సరిపెట్టేశారు. నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్, పీఆర్‌సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది.
చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది.
ఇదీ చదవండి:
గూగుల్‌తో లక్ష ఉద్యోగాలు అనేది అబద్ధం: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు