
విజయవాడ: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు డిమాండ్లతో విద్యుత్ యాజమాన్యంతో చర్చలకు వెళ్లిన జేఏసీకి ఇంకా స్పష్టత రాలేదు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూటమి సర్కార్ మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. వారి హామీలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది.
ప్రధానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అంశంపై విద్యుత్ యాజమాన్యం ఎటు తేల్చకపోవడంతో ఈరోజు ఒక దఫాలో జరిగిన చర్చలు పలప్రదం కాలేదు. దాంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడానికి సమాయత్తమయ్యారు. అయితే విద్యుత్ యాజమాన్యం.. మళ్లీ జేఏసీని చర్చలకు పిలిచింది.
అయితే చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలని జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. విద్యుత్ సౌధాలో జేఏసీ నేతలు తమ నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశం తప్పించి మిగతావి అడగాలని మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దాంతో జేఏసీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంపై క్లారిటీ ఇవ్వాలని అంటుంది.
మళ్లీ కొనసాగుతున్న చర్చలు
ఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 17వ తేదీ) విద్యుత్ యాజమాన్యంతో జరిగిన చర్చల విఫలమై.. ఉద్యోగులు సమ్మె బాటకు సిద్ధమైన తరుణంలో వెంటనే మళ్లీ చర్చలకు పిలిచారు. మరోసారి జేఏసీతో విద్యుత్ యాజమాన్యం చర్చలు జరుపుతుంది. ప్రధానంగా జేఏసీ చైర్మన్, కన్వీనర్‌ను మాత్రమే పిలిచి విద్యుత్ యాజమాన్యం చర్చలు జరుపుతున్నారు. మిగతా నేతలంతా విద్యుత్ యాజమాన్యం వైఖరిపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.