దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ ఆక్టోపస్‌

Andhra Pradesh: Octopus bags First Place in National Competition - Sakshi

హరియాణాలో నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. జాతీయ భద్రతా దళ విభాగం (ఎన్‌ఎస్‌జీ) ‘అగ్ని పరీక్ష–7’ పేరుతో హరియాణాలో ఈ పోటీలు నిర్వహించింది. ఇందులో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు, వివిధ ఆయుధాలతో ఫైరింగ్, మారథాన్‌ రన్నింగ్, శారీరక ధారుడ్య పోటీలు నిర్వహించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ ఆక్టోపస్‌ బృందం మొదటి స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో ఎన్‌ఎస్‌జీతోపాటు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన బృందాలు పాల్గొన్నాయి. ఏపీ అక్టోపస్‌ విభాగం మొదటి స్థానం సాధించడమే కాకుండా ఉత్తమ జట్టుగా కూడా నిలిచింది. రాష్ట్రానికి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఎ.పాపారావు ఉత్తమ ఆల్‌రౌండర్‌గా ఎంపికయ్యారు 

చదవండి: (TTD: టీటీడీ సేవలన్నింటికీ ఒకే యాప్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top