
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీ అయిన నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో 55 కార్పొరేటర్లు, కౌన్సిలర్ పదవులకు సెప్టెంబర్ 17లోగా ఉప ఎన్నికలు నిర్వహించేందకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టింది.
విజయనగరం, విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి నగరపాలక సంస్థల్లో 12 డివిజన్లతోపాటు 34 మున్సిపాలిటీల పరిధిలో 43 వార్డు కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను నిర్ధారించి ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఆయా నగరపాలక సంస్థలు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఆయా డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను నిర్ధారించడంతో పాటు ప్రచురించే అంశంపై సంబంధిత నగరపాలక సంస్థలు, మున్సిపల్ సిబ్బందికి ఈ నెల 12, 13 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు.