1వ తేదీ నుంచి యధావిధిగా రేషన్‌ పంపిణీ: కొడాలి నాని

Andhra Pradesh Minister Kodali Nani Slams Ration Dealers Strike - Sakshi

శ్రీకాకుళం జిల్లా: ఒకటవ తేదీ నుంచి రేషన్ యథావిధిగా పంపిణీ చేస్తాం.. షాపులు మూసేస్తే రేషన్ సప్లై ఆగిపోదు అన్నారు మంత్రి కొడాలి నాని.  ఇప్పుడు 11 వేల వాహనాలతో ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రభుత్వమే చేస్తోంది.. డీలర్‌లకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.. రేషన్ డీలర్ల బెదిరింపులకు ప్రభుత్వం భయపడేది లేదు అని మంత్రి స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘గతంలో రేషన్ షాపుల పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. గతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం రేషన్ దుకాణం నుంచే జరిగేది. రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం అంటే వాటిని పక్కనపెట్టి పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నేరుగా పంపిణీ చేస్తాం’’ అని తెలిపారు. 
(చదవండి: సీఎం జగన్‌ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు: కొడాలి నాని)

‘‘రేషన్ దుకాణాలు కొనసాగాలంటే వారి భాష, పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. లేదు మేము ఇలాగే ఉంటాం అంటే డీలర్లను బైపాస్ చేసి వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తాం. ప్రజలకు నిత్యావసరాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని ఎవరు అడ్డుకుందాం అనుకున్నా కుదరదు’’ అన్నారు.

చదవండి: కుక్కలు ఎవరు బాబూ!?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top