breaking news
ration delars
-
1వ తేదీ నుంచి యధావిధిగా రేషన్ పంపిణీ: కొడాలి నాని
శ్రీకాకుళం జిల్లా: ఒకటవ తేదీ నుంచి రేషన్ యథావిధిగా పంపిణీ చేస్తాం.. షాపులు మూసేస్తే రేషన్ సప్లై ఆగిపోదు అన్నారు మంత్రి కొడాలి నాని. ఇప్పుడు 11 వేల వాహనాలతో ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రభుత్వమే చేస్తోంది.. డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.. రేషన్ డీలర్ల బెదిరింపులకు ప్రభుత్వం భయపడేది లేదు అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘గతంలో రేషన్ షాపుల పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. గతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం రేషన్ దుకాణం నుంచే జరిగేది. రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం అంటే వాటిని పక్కనపెట్టి పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నేరుగా పంపిణీ చేస్తాం’’ అని తెలిపారు. (చదవండి: సీఎం జగన్ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు: కొడాలి నాని) ‘‘రేషన్ దుకాణాలు కొనసాగాలంటే వారి భాష, పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. లేదు మేము ఇలాగే ఉంటాం అంటే డీలర్లను బైపాస్ చేసి వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తాం. ప్రజలకు నిత్యావసరాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని ఎవరు అడ్డుకుందాం అనుకున్నా కుదరదు’’ అన్నారు. చదవండి: కుక్కలు ఎవరు బాబూ!? -
రేషన్ డీలర్లపై క్రిమినల్ కేసులు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో రేషన్ పంపిణీల్లో అక్రమాలకు పాల్పడిన డీలర్లపై క్రిమినల్ కేసుల నమోదుకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. జేసీ ఇంతియాజ్ ఆదేశాల మేరకు విచారణ నిర్వహించగా, నెల్లూరు నగరంలోని ఏడుగురు డీలర్లు అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. దీంతో వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు తహశీల్దార్లను ఆదేశిస్తూ పౌరసరఫరాల శాఖ అధికారి ధర్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.