గిరిజన మహిళ ధైర్యం.. తప్పిన పెనుప్రమాదం

Andhra Pradesh: Gas Leak Incident Women Escaped From Danger Manyam - Sakshi

సాక్షి,గుమ్మలక్ష్మీపురం(పార్వతిపురం మణ్యం): వంట గ్యాస్‌ లీకవడంతో మంటలు చెలరేగగా.. ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకూడదని భావించిన ఓ గిరిజన మహిళ ధైర్యంతో..చాకచక్యంగా వ్యవహరించి గ్యాస్‌ సిలిండర్‌ను ఆరుబయటకు తీసుకొచ్చి పడేయడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలోని పెదఖర్జ పంచాయతీ బొద్దిడి గ్రామానికి చెందిన మండంగి సుజాత సోమవారం ఉదయం ఇంట్లో గ్యాస్‌పొయ్యిపై వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి.

వంట గది పురిపాక కావడంతో మంటలు ఎగసిపడడం గమనించిన ఆమె గ్యాస్‌ సిలిండర్‌ పేలితే పెనుప్రమాదం జరుగుతుందని ఊహించి ఎవరికీ ఎటువంటి నష్టం జరగకూడదని భావించి,  సిలిండర్‌ను పొయ్యి నుంచి వేరు చేసి, ఆరుబయటకు తీసుకొచ్చి మురుగునీటి కాలువలో పడేసింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టు పక్కల వారు వంటగదిలోని మంటలతో పాటు గ్యాస్‌ సిలిండర్‌లోని మంటను ఆర్పివేశారు. ఈ సంఘటణలో ప్రాణాలకు తెగించి సాహసం చేసిన మహిళ ఎడమ చేతికి కొంతమేర కాలిన గాయాలయ్యాయి. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ధైర్యంగా వ్యవహరించిన ఆమెను గ్రామస్తులంతా అభినందిస్తున్నారు.

చదవండి: AP: ఏ  సీఎం ఇలాంటి ఆలోచన చేయలేదు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top