సీఎం జగన్‌కు ధన్యవాదాలు: అంబటి కృష్ణారెడ్డి | Ambati Krishna Reddy Thanked To CM YS Jagan | Sakshi
Sakshi News home page

ఇంతటి హోదా కల్పించిన వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు

Sep 28 2020 1:03 PM | Updated on Sep 28 2020 1:03 PM

Ambati Krishna Reddy Thanked To CM YS Jagan - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రాష్ట్రంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నాపై నమ్మకముంచి ఇంతటి హోదా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తా. రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి మేలు జరుగుతోంది. వైఎస్సార్‌ జలకళ పథకం చరిత్రాత్మకం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్‌ వేసి ఇవ్వడం శుభపరిణామం. రైతులకు ఎరువులు, యూరియా సరసమైన ధరలకే అందేలా చర్యలు తీసుకుంటాం' అని అంబటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు.  (మరో హామీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement