
సాక్షి, అమరావతి : మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరలను క్రమబద్దీకరిస్తూ మార్పులు చేసింది. ఈ మేరకు గురువారం జరిగిన మంత్రివర్గ భేటీ అనంతరం ధరలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై తగ్గించింది. అలాగే 90ఎమ్‌ఎల్ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచింది. బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలు తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.