అన్ని ప్రాంతాలపై సీఎం జగన్‌ సమదృష్టి

Actor Director R Narayanamurthy Praised CM YS Jagan Mohan Reddy - Sakshi

అనంతపురం కల్చరల్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అన్ని ప్రాంతాల పట్ల సమాన భావన ఉందని సినీనటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ప్రముఖ కథా రచయిత డాక్టర్‌ శాంతి నారా­యణ రచించిన ‘సాధన’ నవలావిష్కరణ సభ ఆదివారం అనంతపురంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ రాయలసీమ గొప్ప సంస్కృతీ సంప్రదాయాలకు నెలవన్నారు. కానీ సినీ పరిశ్రమలోని కొందర స్వార్థపరులు సీమ సంస్కృతిని కించపరిచేలా ఫ్యాక్షన్‌ ముద్ర వేసి చూపించడం తనకు వేదన కల్గిస్తోందని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తనతోపాటు కొంతమంది కలసి వెనుకబడిన ఉత్తరాంధ్ర పరిస్థితుల గురించి వివరించిన వెంటనే తాండవ రిజర్వాయర్, ఏలూరు కాలువ ఎత్తిపోతల పథకానికి రూ.470 కోట్లతో అనుమతులివ్వడం సంతోషదాయకమన్నారు.

అంతకుముందు నారాయణమూర్తిని ఏపీ నాటక అకాడమీ చైర్మన్‌ రాగే హరిత, వైఎస్సార్‌సీపీ నాయకులు చామ­లూ­రు రాజగోపాల్‌  వైఎస్సార్‌ జీవిత సాఫల్య పు­ర­స్కార గ్రహీతలు బండి నారాయణస్వామి, డాక్టర్‌ శాంతినారాయణ ఘనంగా సత్కరించారు. ఈ సభకు ఉప్పరపాటి వెంకటేశు అధ్యక్షత వహించగా, రాయలసీమ ఉద్య­మ నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి, మాలపాటి అశోకవర్ధనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top