విశాఖలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం

94 Black Fungus Cases Registered In Visakhapatnam District Says DMHO - Sakshi

విశాఖపట్నం: జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం రేపుతుంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 94 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ బారీన పడిన బాధితులకు విశాఖ కేజీహెచ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద బెడ్స్‌ ఏర్పాటు చేసి  వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు. కాగా కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ఆరోగ్య శ్రీ  కింద 50శాతం బెడ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరైనా ఉల్లఘింస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని సూర్యనారాయణ హెచ్చరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top