
30 కిలోల బరువున్న ఆనపకాయను చూపిస్తున్న మల్లేష్
వజ్రపుకొత్తూరు రూరల్: ఆనపకాయ సాధారణంగా పది నుంచి 15 కిలోల బరువు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే ఆశ్చర్యపోతాం. ఏకంగా 30 కిలోలు ఉంటే ఔరా అనకతప్పదు. వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు బతకల మల్లేష్ సాగు చేస్తున్న పొలంలో ఇదే జరిగింది. ఆనపపాడుకు 30 కిలోల బరువున్న కాయలు కాయడంతో వాటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.