బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజల వరప్రదాయిని తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వ 13.670 టీఎంసీలకు చేరింది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, తీర్థనహళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడంతో వరద నీటి చేరిక ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది. డ్యాం ఎప్పుడూ నిండుతుందా అని హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1,633 అడుగులు కాగా, గురువారం నాటికి 1,592.95 అడుగుల మేర నీరు చేరింది. 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యం కాగా, 13.670 టీంఎసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 28,654 క్యూసెక్కులుండగా, 177 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతోంది.


