‘ఏ నోటి దూలతో అయితే రాజకీయాల్లోకి వచ్చావో అదే నోటి దూలతో పతనం అవుతావ్‘ అంటూ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు తోపుదుర్తి నయనతారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంఎస్ రాజు ఆస్తుల కొనుగోళ్లపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపిన ప్రతి అంశానికీ ఆధారాలు చూపిస్తామని ప్రకటించారు. ‘ఇది కచ్చితంగా ధనాహంకారమే. నడమంత్రపు సిరి నడాల మీద పుండు అన్న ట్లుగా వ్యవహరిస్తున్నారు. మా కుటుంబం సవాల్‌ను స్వీకరించింది. ఎంఎస్ రాజు ఆస్తుల కొనుగోళ్లపై ప్రకాష్‌రెడ్డి తెలిపిన వాటికి ఆధారాలు చూపిస్తాం. నిజాయితీ ఉంటే టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసి నిరూపించుకోవాలి‘ అని సవాల్ విసిరారు. పోలీసులు ద్వంద్వ వైఖరి మానుకోవాలని, చట్టం ముందు అందరినీ సమానంగా చూడాలని హితవు పలికారు.


