ఆత్మకూరు: వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలమని, కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని అండగా నిలుస్తామని రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని తన స్వగృహంలో శనివారం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులతో ఆయన సమావేశమై మాట్లాడారు. గ్రామ కమిటీ అధ్యక్షులను పార్టీ కార్యకర్తలకు పరిచయం చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షుడితో మొదలు ప్రతి ఒక్కరూ పార్టీ గుర్తింపు కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. గుర్తింపు కార్డు లేని వారు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
ఓటు హక్కును కాపాడుకుందాం
మనం ఎక్కడున్నా... నియోజకవర్గంలోనే ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలని కార్యకర్తలకు ప్రకాష్‌రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలోనూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో బీఎల్‌ఓలు, గ్రామ కమిటీ అధ్యక్షులు కీలకంగా వ్యవహరించాలన్నారు. గ్రామంలో ఎవరికై నా ఓటు హక్కు ఉందో లేదా తెలుసుకుని వారిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ఎండగట్టాలని యువతకు పిలుపునిచ్చారు. అలాగే వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు మనం చేసిన మంచిపై చైతన్యం తీసుకురావాలన్నారు.
గ్రామ స్థాయి సమావేశాలతో
చైతన్యం పరచాలి
గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్య పరచాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేరూరు డ్యాంకు నీరు అందకుండా చేశారని, అలాగే హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేసి రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. పాపంపేటలో 300 ఎకరాలను ఆక్రమించుకోవాలని చూశారని, 14 ఇళ్లను కూలదోశారని, ఆ సమయంలో బాధితులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని జగనన్నతో మాట తీసుకున్నామని, ఇందులో భాగంగానే పిల్ల కాలువల ద్వారా లక్ష ఎకరాలకు నీరు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దుబ్బా చంద్రశేఖరరెడ్డి, రంగంపేట గోపాలరెడ్డి, బాలపోతన్న, వీరాంజనేయులు, నరసింహారెడ్డి, గూలి కొండారెడ్డి, సుభద్రమ్మ, వాసుదేవరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, సనప గోపాలరెడ్డి, కృష్ణానాయక్, మల్లారెడ్డి, మీనుగ నాగరాజు, ఎంపీటీసీ పోతులయ్య, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, సుదాకర్‌రెడ్డి, యల్లప్ప, భాస్కర్, లోకేష్, అమర్‌నాథ్, రమేష్, కొండా, ఆదెప్ప, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, వెంకటేష్, మురళి, ఓబీ టైలర్ వెంకటేష్, ఆంజనేయులు, నరసింహ పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్యపరచండి
పిల్ల కాలువల ద్వారా పొలాలకు నీరు
అందించడమే మా లక్ష్యం
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి


