●బాబోయ్‌ ఎండలు | - | Sakshi
Sakshi News home page

●బాబోయ్‌ ఎండలు

Apr 24 2026 6:14 AM | Updated on Apr 24 2026 6:14 AM

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. 10 గంటల తర్వాత ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఎండవేడిమికి వృత్తిదారులు తమ పనులు చేయలేకపోతున్నారు. ఉపాధి వేతనదారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రామికులు, ఫుట్‌పాత్‌ వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఎండ వేడి, ఉక్కపోత ఉండడంతో జిల్లావాసులు విలవిల్లాడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం:

తోపుడు బండిపై గుజరీ వేసుకుని వెళుతున్న మహిళ మండు టెండలో అనంతపురం వన్‌టౌన్‌ పీఎస్‌ వద్ద చంటి బిడ్డతో సేద తీరుతున్న దృశ్యం

ఎండ వేడి నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించేలా ఆటోపై ఏర్పాటు చేసిన రబ్బరు షీట్‌

రోడ్డు పక్కన చెట్ల కింద భోజనం చేస్తున్న వ్యవసాయ కూలీలు

Advertisement
 
Advertisement
Advertisement