
ట్రంప్ సుంకాలు దేశానికి నష్టం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు
రాంభూపాల్
అనంతపురం టవర్‌క్లాక్: ట్రంప్ విధిస్తున్న సుంకాలు దేశానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ అన్నారు. ‘ట్రంఫ్ టారిఫ్ – టెర్రరిజం – భారతదేశంపై ప్రభావం’ అంశంపై ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాంభూపాల్ మాట్లాడుతూ.. ఇప్పటికే అనేక దిగుమతులపై 25 శాతం వరకు సుంకాన్ని ట్రంప్ విధించారని గుర్తు చేశారు. తాజాగా ఫార్మా దిగుమతులపై వంద శాతం సుంకం విధించారన్నారు. కొన్ని రోజులుగా హెచ్1 బీ వీసాలపై పది లక్షల డాలర్లు పన్ను వేశారన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై కూడా సుంకాలను అమెరికా విధిస్తోందన్నారు. ఇప్పటికే ఆక్వా రైతులు తమ ఉత్పతులు ఎగుమతులు చేసుకోలేక నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ట్రంప్ టారీఫ్‌లపై ప్రధాని నరేంద్ర మోది నోరు విప్పాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప, కార్యదర్శి వర్గ సభ్యుడు బాల రంగయ్య, తదితరులు మాట్లాడారు.