
వైస్ ఎంపీపీ బైక్‌కు నిప్పు
కళ్యాణదుర్గం: బ్రహ్మసముద్రం మండల వైఎస్సార్‌సీపీ నేత, వైస్ ఎంపీపీ వెంకటేష్‌నాయక్‌కు చెందిన ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లికి చెందిన వెంకటేష్‌నాయక్ ఆదివారం కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లి తండాకు వేరుశనగ కాయలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు. సాయంత్రం వేరుశనగ బస్తాలను బొమ్మగానిపల్లి తండాకు తరలించేందుకు ఆటోలు అందుబాటులో లేకపోవడంతో అదే గ్రామంలో ఉంటున్న తన సోదరి ఇంట్లోనే ఉండిపోయాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం రూరల్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సమస్యాత్మక రైలు మార్గాల్లో అప్రమత్తంగా ఉండాలి
గుంతకల్లు: ప్రస్తుత కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక రైలు మార్గాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ రైల్వే అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జోనల్ పరిధిలోని డీఆర్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. గుంతకల్లు నుంచి డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా, అడిషనల్ జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. వర్షాల సమయంలో రైలు కార్యకలాపాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వంతెనలు, సోరంగాలు, రోడ్డు అండ్ బ్రిడ్జిల వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అప్రమత్త చర్యల్లో భాగంగా కంకర, సిమెంట్, బండరాళ్లు, ఇసుక, తదితరాలను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ప్రయాణికుల భద్రత, రైలు కార్యకలాపాలకు ఎలాంటి అంటకాలు కలగకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతపురం సబ్ రిజిస్ట్రార్‌గా ఇస్మాయిల్
అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అనంతపురం అర్బన్ (రామ్‌నగర్) ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా ఇస్మాయిల్‌ను నియమిస్తూ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. రామ్‌నగర్ జాయింట్ –2 సబ్ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న యూనస్‌ను తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్‌గా బదిలీ చేయడంతో ఆయన సోమవారం రిలీవ్ అయ్యారు. దీంతో అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఇస్మాయిల్‌ను ప్రధాన కారాలయం ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండు రోజుల్లో ఆయన సబ్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలను సీకరించనున్నారు.
తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్‌గా యూనస్
తాడిపత్రి టౌన్: స్థానిక సబ్ రిజస్ట్రార్‌గా యూనస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి డిప్యుటేషన్‌పై ఆయనను తాడిపత్రికి బదిలీ చేశారు.

వైస్ ఎంపీపీ బైక్‌కు నిప్పు