పేద విద్యార్థులు వైద్య విద్య చదవొద్దా? | - | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులు వైద్య విద్య చదవొద్దా?

Oct 1 2025 10:21 AM | Updated on Oct 1 2025 10:21 AM

పేద విద్యార్థులు వైద్య విద్య చదవొద్దా?

పేద విద్యార్థులు వైద్య విద్య చదవొద్దా?

అనంతపురం ఎడ్యుకేషన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు మాట్లాడుతూ సీఎంగా ఉన్న సమయంలో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంద న్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు కావాలని, తమ విద్యార్థులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కోరిన ప్రభుత్వాలను చూశాం కానీ, మెడికల్‌ కళాశాలలు తాము నిర్వహించలేమంటూ కేంద్రా నికి లేఖ రాసిన ఏకై క ప్రభుత్వం ప్రస్తుత కూటమి సర్కారే అని దుయ్యబట్టారు. ఒక్కో కళాశాలలో 15 శాతం సీట్లు కేంద్రం భర్తీచేస్తే తక్కిన 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉచితంగా వైద్యవిద్య చదివే వీలుండేదన్నారు. అలాంటిది ఉన్న కళాశాలలన్నీ ప్రైవేట్‌ పరం చేస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మారుతుందన్నారు. నగర మేయర్‌ వసీం మాట్లాడుతూ మంజూరైన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించడం దుర్మార్గమన్నారు. నిర్వహణ సాధ్యం కాదని కేంద్రానికి లేఖ రాసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ సెల్‌ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి చామలూరు రాజగోపాల్‌, రాష్ట్ర కార్యదర్శి మిద్దె కుళ్లాయప్ప మాట్లాడుతూ పీపీపీ విధానం మాటున ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారన్నారు.రాష్ట్రంలో పేద విద్యార్థులు వైద్యవిద్య చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. ప్రైవేట్‌గా మెడికల్‌ సీటు పొందాలంటే రూ.80 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని, పేద వర్గాలకు ఇది సాధ్యమేనా అని వాపోయారు. పేదలను వంచిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, నగర అధ్య క్షుడు సోమశేఖర్‌రెడ్డి, మైనార్టీ, ఎస్టీ, మహిళ, విద్యార్థి విభాగాల అధ్యక్షులు సైఫుల్లాబేగ్‌, శ్రీనివాసనాయక్‌, శ్రీదేవి, చంద్రశేఖర్‌యాదవ్‌, పార్టీ నాయకులు పసలూరు ఓబులేసు, రాఘవ, రాఘవేంద్రప్రసాద్‌, సాకే శంకర్‌, ఎగ్గుల శ్రీనివాసులు, గౌస్‌బేగ్‌, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మారుతీనాయుడు, నరేంద్రరెడ్డి, ఆంజనేయులు, కాట మయ్య, సాకే కుళ్లాయిస్వామి,అశోక్‌, ప్రియాంక, వెన్నం శివరామిరెడ్డి, మారుతీప్రసాద్‌, రామాంజనేయులు, శోభారాణి, శోభాబాయి, కమల్‌ భూషణ్‌, కై లాస్‌, నితిన్‌రెడ్డి పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్‌ హయాంలో 17 వైద్య కళాశాలలు

బాబు నిర్ణయంతో నిరుపేద

విద్యార్థులకు అందని ద్రాక్షగా వైద్య విద్య

కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే

భవిష్యత్తులో చంద్రబాబుకు

ప్రజలే గుణపాఠం చెబుతారు

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌

నాయకుల హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement