
వాహనం ఢీ కొని మహిళ మృతి
పామిడి: స్థానిక 44వ జాతీయ రహదారిపై ఓ రెస్టారెంట్ సమీపంలో బుధవారం చోటు చేసుకున్న ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. మతిస్థిమితం లేని మహిళ(40) రోడ్డు దాటుతున్న సమయంలో బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనం ఢీకొని దుర్మరణం పాలైంది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. ఘటనపై పామిడి పోలీసులు కేసు నమోదు చేశారు.
20 మంది అడ్మిన్లకు షోకాజ్
అనంతపురం కార్పొరేషన్: విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన 20 మంది అడ్మిన్లకు నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ తీసుకున్న వారిలో బి.రవికుమార్, సి.ప్రసాద్, సి.ప్రకాష్‌రెడ్డి, పి.లక్ష్మీకాంత్, జె.గౌతమి గీత, బి.ముత్యాలయ్య, జె.ప్రకాష్, పి.శ్రీహరి, ఎస్.అపర్ణ, ఎం.ఊహ, బి.రియాజ్‌బాషా, వి.రాజేష్‌రెడ్డి, కె.గంగాదేవి, డి.రాజేంద్ర ప్రసాద్, సి.శశికళ, ఎం.శ్రీవాణి, పి.విమలేష్, ఎ.మౌనిక, జి.శ్రీధర్‌రెడ్డి, జె.ఝాన్సీలక్ష్మి ఉన్నారు. అలాగే అడ్మిన్‌లు కె.శివశంకర్, జి.నాగలలిత, సి.ధర్మేంద్ర, బి.ముత్యాలయ్య, ఎస్.అపర్ణ, పి.ప్రదీప్, ఎం.శ్రీవాణి, పి.శ్రీహరి, సి.రాజశేఖర్‌కు మెమో జారీ చేశారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
పెనుకొండ: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ సూచించారు. పెనుకొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను బుధవారం సీపీఎం నాయకులతో కలసి ఆయన పరిశీలించి, మాట్లాడారు. వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలనుకోవడం అవివేకమన్నారు. 2023లో గత ప్రభుత్వం పెనుకొండలో వైద్య కళాశాల భవన నిర్మాణాలను చేపట్టి రూ. 30 కోట్ల మేర ఖర్చు పెట్టిందని, ఇలాంటి తరుణంలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతమైన పెనుకొండలో సత్వరం మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పెనుకొండలో మెడికల్ కళాశాల ఏర్పాటైతే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఇది పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. అదే ప్రైవేట్ పరమైతే ఫీజుల భారం పడుతుందన్నారు. వైద్య సేవలు అత్యంత ఖరీదుతో కూడుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక విధానాలను వీడి ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గంగాధర్, వెంకటరాముడు, సీఐటీయూ జిల్లా నాయకుడ నాగరాజు పాల్గొన్నారు.
అలరించిన మలేషియా భక్తులు
ప్రశాంతి నిలయం: పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి చేరుకున్న మలేషియా భక్తులు బుధవారం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. అనంతరం మహాసమాధిని దర్శించుకున్నారు.

వాహనం ఢీ కొని మహిళ మృతి