
యువతి ఆత్మహత్య
రాయదుర్గం టౌన్: మండలం మెచ్చిరి గ్రామంలో బుధవారం సాయంత్రం కర్ణాటకకు చెందిన ఆశ(17) ఆత్మహత్య చేసుకుంది. సరిహద్దు కర్ణాటకలోని మొలకాల్మూరు తాలూకా బొమ్మలింగనహళ్లి గ్రామానికి చెందిన మల్లికార్జున, నిర్మల దంపతుల కుమార్తె ఆశ మొలకాల్మూరులో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతోంది. నాలుగు రోజుల క్రితం మెచ్చిరి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చి మేనమామ ఇంట్లో ఉంటోంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆశ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్ర స్థాయి ఉషు పోటీలకు గుత్తి విద్యార్థినులు
గుత్తి: స్థానిక కర్నూలు రోడ్డులో ఉన్న జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థునులు 8 మంది రాష్ట్ర స్థాయి ఉషు పోటీలకు ఎంపికయ్యారు. గత మంగళవారం అనంతపురంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో గుత్తి విద్యార్థులు ప్రతిభ చాటి అండర్–17 విభాగానికి ఆరుగురు, అండర్ –19కు ఇద్దరు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆ పాఠశాలలో విద్యార్థులను హెచ్‌ఎం సుంకన్న, పీడీలు సరోజ, శ్యామల, లోకేశ్వరి అభినందించారు.
వ్యక్తి బలవన్మరణం
గుత్తి: స్థానిక కురుబ వీధిలో నివాసముంటున్న అప్పారెడ్డి (56) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన రెండు వారాల క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆరోగ్యం మదన పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది బుధవారం గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్‌ఐ మహేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద లభ్యమైన సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని రాసి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

యువతి ఆత్మహత్య

యువతి ఆత్మహత్య