
డీపీఆర్వో రమణకు పదోన్నతి
అనంతపురం అర్బన్: జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డీపీఆర్‌ఓ)పి.వెంకటరమణకు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పదోన్నతి కల్పిస్తూ బాపట్ల జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది. పదోన్నతిపై వెళుతున్న రమణను కార్యాలయ సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించారు. డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య మాట్లాడుతూ డీపీఆర్‌ఓగా వెంకటరమణ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఏపీఆర్‌ఓ ఫకృద్ధీన్, పీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, సిబ్బంది ప్రభావతి, దామోదర్‌రెడ్డి, కమల్, ఆంజనేయులు, భాస్కర్, ఖాసీమ్ పాల్గొన్నారు.
ఉల్లి పంట పరిశీలన
గుమ్మఘట్ట: మండలంలో రైతులు సాగు చేసిన ఉల్లి పంటను జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి బుధవారం పరిశీలించారు. ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గత నెల 31న ‘కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి’ శీర్షికన ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఆమె స్పందించారు. గుమ్మఘట్ట మండలం 75వీరాపురం గ్రామ సమీపంలో రైతులు సాగు చేసిన ఉల్లి పంటను పరిశీలించారు. అధిక వర్షాల కారణంగా దిగుబడిలో నాణ్యత లోపించినట్లుగా గుర్తించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ.. దిగుబడుల, మార్కెటింగ్ తదితరాలపై ఆరా తీశారు. బహిరంగ మార్కెట్‌లో ఽఉల్లి ధరలు దారుణంగా పడిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను గ్రేడింగ్ చేసి సమీపంలోని బెంగళూరు, దావణగెర మార్కెట్‌లకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట స్థానిక ఉద్యాన అధికారి కృష్ణతేజ, సర్పంచ్ నాగరాజు తదితరులు ఉన్నారు.
జిల్లాకు 1,923 మెట్రిక్ టన్నుల ఎరువులు
అనంతపురం అగ్రికల్చర్: స్పిక్ కంపెనీ నుంచి 1,922.75 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు సరఫరా కాగా, ఇందులో 904.5 మెట్రిక్ టన్నుల యూరియా ఉన్నట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌కు బుధవారం వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులు, యూరియాను పరిశీలించారు. 904.5 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 507.85 మెట్రిక్ టన్నుల డీఏపీ, 255.2 మెట్రిక్ టన్నుల 20–20–0–13, 255.2 మెట్రిక్ టన్నుల 10–26–26 రకం కాంప్లెక్స్ ఎరువులు చేరాయన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు యూరియాకు సంబంధించి కోటా మేరకు 399.915 మెట్రిక్ టన్నులు అనంతపురం మార్క్‌ఫెడ్‌కు, 200.655 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లకు కేటాయించగా... 303.93 మెట్రిక్ టన్నులు శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. కాంప్లెక్స్, డీఏపీలు 90 శాతం మేర ప్రైవేట్ హోల్‌సేల్ డీలర్లకు 10 శాతం మార్క్‌ఫెడ్‌కు కేటాయించినట్లు వివరించారు.
9 బార్ల నిర్వహణకు
నోటిఫికేషన్ జారీ
అనంతపురం: నూతన బార్ పాలసీలో భాగంగా గత వారం జారీ చేసిన 9 బార్ల ఏర్పాటు నోటిషికేషన్‌కు ఎలాంటి దరఖాస్తులు అందకపోవడంతో తాజాగా మరోసారి నోటిఫికేషన్‌ను జిల్లా ఎకై ్సజ్ అధికారులు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువుగా నిర్ధేశించినట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15న లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామన్నారు. అనంతపురంలో 3, గుంతకల్లు 2, గుత్తి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 9 బార్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.
ఎలుగుబంట్ల దాడిలో
కాపరికి తీవ్ర గాయాలు
రొళ్ల: రెండు ఎలుగుబంట్లు దాడి చేయడంతో మేకల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో జరిగింది. టీడీ పల్లి ఎస్సీ కాలనీకి చెందిన రంగధామప్ప మేక పిల్లల మేత కోసం గ్రామ పొలిమేర వద్ద గడ్డి కోస్తుండగా పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి రెండు పెద్ద ఎలుగుబంట్లు హఠాత్తుగా వచ్చి దాడి చేశాయి. తప్పించుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. వెంబడించి మరీ ఎడమ చేయి, భుజం, కుడికాలు తొడ కింద భాగాన తీవ్రంగా రక్కి గాయపరిచాయి. అతి కష్టంపై తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే రొళ్ల సీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.

డీపీఆర్వో రమణకు పదోన్నతి

డీపీఆర్వో రమణకు పదోన్నతి

డీపీఆర్వో రమణకు పదోన్నతి