
ప్రైవేటు టీచర్లకూ అవార్డులు ఇవ్వాలి
దశాబ్దాలుగా విద్యార్థులనే నా పిల్లలుగా భావించి ఎక్కువ శాతం వారి వద్దనే గడపడానికి ప్రయత్నిస్తున్నా. వారు కూడా నన్ను అమ్మలాగానే చూస్తారు. సైన్స్ ఫేర్, వివిధ రకాల పోటీల్లో విద్యార్థులను చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోని విధంగా నిబద్ధత, నిజాయితీతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించకపోవడం అన్యాయం. ఈ తీరు మారాలి.
– మహ్మద్ షమీమ్, ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు,
అనంతపురం