
ఏడుగురికి ఎంపీడీఓలుగా పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడుగురికి ఎంపీడీఓలుగా పదోన్నతి దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న 156 మందికి ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మొత్తం ఏడుగురు ఉన్నారు. ఏఓలు ఉమాదేవి (జెడ్పీ–అనంతపురం), జి.శ్రీనివాసులు (బత్తలపల్లి), జయరాములు(వజ్రకరూరు) ఎంపీడీఓగా పదోన్నతి పొందారు. డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్ నుంచి శకుంతల (నల్లచెరువు), మాధవి(డీపీఆర్‌సీ–అనంతపురం), ఆనంద్ (రాప్తాడు), కమలాబాయ్(పెనుకొండ) ఉన్నారు.
● ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన వారికి ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శివశంకర్ గురువారం రాత్రి తెలిపారు. ఈ మేరకు వారందరికీ సమాచారం ఇచ్చామని వివరించారు.