
నేత్రదానం ఎంతో గొప్పది
● కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం మెడికల్: నేత్రదానం ఎంతో గొప్పదని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా గురువారం రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్, జిల్లా పరిషత్ మీదుగా తిరిగి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ సాగింది. కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ నేత్రదానంపై అపోహలు వీడాలన్నారు. దివంగత కన్నడ నటుడు రాజ్‌కుమార్, ఆయన కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ స్ఫూర్తితో ఇటీవల విజయవాడలో తన సతీమణితో కలసి నేత్రదాన ప్రతిజ్ఞ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ సైదన్న తదితరులు పాల్గొన్నారు.