
పురంలో ‘గణ’వీడ్కోలు
జై బోలో గణేశ్ మహరాజ్‌కీ జై .. గణపతి బొప్పా మోరియా అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో హిందూపురం వీధులన్నీ ప్రతిధ్వనించాయి. ఎటు చూసినా భక్తుల కోలాహలం... తప్పెట వాద్యాలు.. చెక్క భజనలు, బ్యాండు మేళాలు, భక్తి గీతాలాపనలు, యువకుల ఈలలు, కేరింతలే దర్శనమిచ్చాయి. 9 రోజులపాటు పూజలందుకుందుకున్న గణనాథుడు
గంగమ్మ ఒడికి చేరాడు. ఏకదంతుడైన వినాయకుడి నిమజ్జనం గురువారం హిందూపురం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగింది. పట్టణంలో కొలువు దీరిన 138 వినాయక విగ్రహాలను గుడ్డం కోనేరులో నిమజ్జనం చేశారు. – హిందూపురం

పురంలో ‘గణ’వీడ్కోలు