
పనితీరులో మార్పు రావాలి
అనంతపురం సిటీ: ‘గతంలో ఎలా పని చేశారో నాకు అనవసరం. ఇకపై పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాలి. మెరుగైన ఫలితాలు సాధించాలి. పనితీరులో మార్పు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని పంచాయతీరాజ్ ఉద్యోగులను ఆ శాఖ ఎస్‌ఈ వై.చిన్నసుబ్బరాయుడు హెచ్చరించారు. పదోన్నతిపై బాపట్ల నుంచి వచ్చిన ఆయన అనంతపురంలోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ పీఏ రాజేంద్రప్రసాద్, సూపరింటెండెంట్లు ఖాజీ మొహిద్దీన్, రమాదేవి, డీఈఈలు కృష్ణజ్యోతి, కె.లక్ష్మీనారాయణ, శ్రీనివాసకుమార్, ఏఈఈ హుస్సేన్‌బాషా, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈఈ ప్రభాకర్‌రెడ్డితో కలసి తన చాంబర్‌లో ఉద్యోగులతో సమావేశమై మాట్లాడారు. రెగ్యులర్ ఉద్యోగులు ఎవరెవరు, ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్నదెవరు, డిప్యూటేషన్లపై ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. అన్ని శాఖలకంటే పంచాయతీరాజ్ శాఖ పురోగతిలో ముందు వరుసలో ఉండాలన్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ ప్రణాళికా బద్ధంగా మసలుకోవాలన్నారు. కేటాయించిన పనులు ఎప్పటికప్పుడు పూర్తి కావాలన్నారు. గ్రూపు రాజకీయాలు నడిపితే సహించేది లేదన్నారు.
పీఆర్ ఉద్యోగుల సమీక్షలో
ఎస్‌ఈ చిన్న సుబ్బరాయుడు