
గుంతకల్లు రూరల్: మండలంలోని ఓబుళాపురం గ్రామానికి చెందిన పుష్పలత (19) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. నాగిరెడ్డి, తిరుమలమ్మ దంపతులకు బీటెక్ చదువుతున్న కుమారుడితో పాటు కుమార్తె పుష్పలత ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన పుష్పలత కొన్ని సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధ పడుతుంది. తల్లిదండ్రులు చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. నొప్పి తీవ్రత తాళలేక బుధవారం ఉదయం తల్లి ఇంటి బయట దుస్తులు ఉతుకుతుండగా ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న కసాపురం పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.