పలు మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు అక్కడక్కడ వడగండ్ల వాన పడింది. రాయదుర్గంలో 35 మి.మీ, ఉరవకొండ 30, బెళుగుప్ప, బుక్కరాయసముద్రం, గుంతకల్లులో 20, కూడేరు, గార్లదిన్నె, గుత్తి, పెద్దపప్పూరు, అనంతపురంలో పది మి.మీ మేర వర్షపాతం నమోదైంది. వజ్రకరూరు, బొమ్మనహాళ్, పామిడి, రాప్తాడు, నార్పల, శింగనమల, కణేకల్లు తదితర మండలాల్లో వర్షం కురిసింది. గుమ్మఘట్ట మండలం రంగచేడు, గార్లదిన్నె మండలం పెనకచెర్ల, రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో టెంకాయ చెట్లపై పిడుగులు పడ్డాయి.
పెనకచెర్లలో టెంకాయ చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగిన దృశ్యం


