స్మార్ట్ రవాణా, డిజిటల్ ఆవిష్కరణలకుఅంతర్జాతీయ భాగస్వామ్యం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ–రష్యా సమాఖ్యలోని మాస్కో ప్రభుత్వం మధ్య కుదిరిన మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్ (ఎంవోసీ) విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి స్మార్ట్, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా కీలక ముందడుగని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. మాస్కోలో నిర్వహించిన 5వ ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సమ్మిట్‌లో మాస్కో డిప్యూటీ మేయర్, రవాణా, రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖాధిపతి మక్సిమ్ లిక్సుటోవ్‌తో కలిసి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఆధునిక, సుస్థిర పట్టణ రవాణా వ్యవస్థల అభివృద్ధి, సమగ్ర రవాణా ప్రణాళికలు, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లు, టికెటింగ్ వ్యవస్థల డిజిటలైజేషన్‌తో పాటు కృత్రిమ మేధస్సు ఆధారిత రవాణా నిర్వహణ మెరుగవుతుందన్నారు. అలాగే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


