తుమ్మపాల: రెవెన్యూ శాఖలో 36 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేసి పదవీ విరమణ పొందిన సుబ్బలక్ష్మిని ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించి ఆమెను కలెక్టర్ సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతటి ఒత్తిడినైనా ప్రశాంతతతో స్వీకరిస్తూ వృత్తి బాధ్యతలు నిర్వర్తించి ఒక ‘రోల్ మోడల్‘ (ఆదర్శ అధికారి)గా నిలిచారని అభివర్ణించారు. జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణ మాట్లాడుతూ సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన అంకితభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పదవీ విరమణ పొందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ తన కెరీర్‌లో ఎందరో సీనియర్ ఐఏఎస్ అధికారులతో పనిచేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఉద్యోగులు పాల్గొన్నారు.
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మికిఘనంగా వీడ్కోలు సత్కారం


