ఐఎఫ్‌ఆర్‌కు ఏర్పాట్లు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఐఎఫ్‌ఆర్‌కు ఏర్పాట్లు వేగవంతం

Feb 10 2026 7:35 AM | Updated on Feb 10 2026 7:35 AM

ఐఎఫ్‌

ఐఎఫ్‌ఆర్‌కు ఏర్పాట్లు వేగవంతం

ఏయూ క్యాంపస్‌: ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూకు నగరం ముస్తాబవుతోంది. ఇప్పటికే కొత్త రోడ్లు వేసిన అధికారులు, రంగులు వేయడం ద్వారా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే పనులను వేగవంతం చేస్తున్నారు. డివైడర్‌ మధ్యలో ప్రత్యేక ఇనుప స్తంభాలను ఏర్పాటు చేసి ఐఎఫ్‌ఆర్‌కు సంబంధించిన జెండాలను ఎగురవేశారు. బీచ్‌రోడ్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో గోడలకు సముద్రం, లైట్‌హౌస్‌, నౌకలు వంటి థీమ్‌లతో ఆకట్టుకునే చిత్రలేఖనాలు చేపడుతున్నారు. ఈ పనుల్లో కార్మికులు నిమగ్నమై ఉన్నారు. మరోవైపు సందర్శకులు కూర్చుని వీక్షించేందుకు వీలుగా వేదికల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఫుట్‌పాత్‌లపై సందర్శకుల కోసం ప్రత్యేక తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఇనుప తిన్నెలపై కూడా బారికేడ్లు నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. సోమవారం రక్షణ రంగానికి చెందిన విమానాలు పలుమార్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ దర్శనమిచ్చాయి.

ఐఎఫ్‌ఆర్‌కు ఏర్పాట్లు వేగవంతం 1
1/1

ఐఎఫ్‌ఆర్‌కు ఏర్పాట్లు వేగవంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement