ఏపీ పీఎస్‌ హెచ్‌ఎం ఫోరం జిల్లా అధ్యక్షునిగా కృష్ణమోహన్‌ | - | Sakshi
Sakshi News home page

ఏపీ పీఎస్‌ హెచ్‌ఎం ఫోరం జిల్లా అధ్యక్షునిగా కృష్ణమోహన్‌

Feb 9 2026 7:38 AM | Updated on Feb 9 2026 7:38 AM

ఏపీ పీఎస్‌ హెచ్‌ఎం ఫోరం జిల్లా అధ్యక్షునిగా కృష్ణమోహన్‌

ఏపీ పీఎస్‌ హెచ్‌ఎం ఫోరం జిల్లా అధ్యక్షునిగా కృష్ణమోహన్‌

అనకాపల్లి: ఏపీ పీఎస్‌ హెచ్‌ఎం ఫోరం జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా వి.కృష్ణమోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక గాంధీనగరం సంయుక్త కాలేజీలో ఆదివారం ఈ ఎన్నిక నిర్వహించారు. కమిటీ గౌరవాధ్యక్షునిగా జి.వి.సన్యాసిరావు, ఉపాధ్యక్షులుగా పి.కనకరాజు, ఎం.వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కె.విజయలక్ష్మి, అదనపు కార్యదర్శిగా ఎం. నాయుడు, కార్యదర్శిగా ఎం.పట్టాభి, కోశాధికారిగా నిర్మలా రాణి, అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఎం.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా రాజేశ్వరరావు, సన్యాసిరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వి.కృష్ణమోహన్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏపీపీఎస్‌హెచ్‌ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement