వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌కు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌కు ఘన స్వాగతం

Feb 8 2026 4:07 AM | Updated on Feb 8 2026 4:07 AM

వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌కు ఘన స్వాగతం

వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌కు ఘన స్వాగతం

కశింకోటలో వందేమాతరం సైకిల్‌ ర్యాలీకి స్వాగతం పలుకుతున్న పోలీసులు, యువత

కశింకోట: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో చేపట్టిన ‘వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌ – 2026’సైకిల్‌ యాత్రకు స్థానిక పోలీసులు శనివారం ఘనంగా స్వాగతం పలికారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు సైకిల్‌ యాత్రను చేపట్టారు. అది ఇక్కడకు చేరడంతో సీఐ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు రహిత సమా జ నిర్మాణానికి దోహద పడాలన్నారు.ఎస్‌ఐలు లక్ష్మణరావు, మనోజ్‌ కుమార్‌, సిబ్బంది, స్థానిక యువకులు ర్యాలీకి స్వాగతం పిలాకారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement